మ‌రో ఉద్దానాన్ని త‌ల‌పిస్తున్న ఊట‌గుండం!

-

మూడు నెల‌ల్లో కిడ్నీ వ్యాధుల‌తో 7 గురు మృతి
క‌లుషిత నీరే కార‌ణ‌మంటున్న గ్రామ‌స్తులు
ప‌ట్టించుకోని అధికారులు

కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వర్గం ప‌రిధిలోని ఊట‌గుండం గ్రామం కిడ్నీ వ్యాధుల‌తో మ‌రో ఉద్ధానాన్ని త‌ల‌పిస్తోంది. సముద్రతీరానికి ఆనుకొని ఉన్న ఊటగుండం గ్రామ‌స్తుల‌ను కిడ్నీ వ్యాధి సమస్య కునుకు లేకుండా చేస్తుంది. మూడు నెలల వ్యవధిలో గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఈ కిడ్నీ సమస్యతో బాధపడుతూ మృతిచెందడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ప్రస్తుతం గ్రామంలోని మరికొంతమంది కూడా ఈ సమస్యతో విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. తమకు అందించే తాగునీరు కలుషితమవ్వడం వల్లే కిడ్నీ వ్యాధి సమస్య తమ గ్రామానికి మహమ్మారిలా పట్టిందని గ్రామస్తులు లబోదిబోమంటున్నారు.

కోడూరు మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీకి చెందిన ఊటగుండం గ్రామంలో మొత్తం 200 కుటుంబాలకు చెందిన 700మంది జనాభా నివాసముంటున్నారు. ఇక్కడ గ్రామస్తులు నిత్యం తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు. వీరందరికి నాగాయలంక మండలం కమ్మనమోల పంపుహౌస్‌ నుంచి తాగునీటిని పైప్‌లైన్‌ ద్వారా సరఫరా చేస్తారు. అయితే ఈ గ్రామం చిట్టచివరన ఉండడంతో కుళాయిల వెంట తాగునీరులో చెత్తచెదారాలతో కూడిన మురుగు నీరు వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక ఇంటి అవసరాలకు ఉపయోగించుకునే నీరు పూర్తిగా పసర్లు కమ్మి ఉంటాయని వాపోయారు. గ్రామంలోని కుళాయిల వద్ద కూడా మురుగు పెరుకుపోయి పారిశుద్ధ్యం లోపించిం దని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడు నెలల్లో ఏడుగురు మృతి..

తాగునీరు కలుషితమవ్వడం వల్ల తమ వారికి కిడ్నీ వ్యాధి సోకిందని ఊటగుండం గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. ఈ నీరు తాగడం వల్లే మూడు నెలల వ్యవధిలో గ్రామానికి చెందిన ఏడుగురు మృతి చెందారని వాపోతున్నారు. రెండు రోజుల క్రితం కురాకుల వెంకటేశ్వరరావు(52) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు గ్రామస్తులు చెప్పారు. అదే గ్రామానికి చెందిన దేవనబోయిన శ్రీనివాసరావు (47), ఆరేపు ఆంజ నేయులు (55), దేవనబోయిన వెంకటేశ్వరమ్మ(42), కూచిబోయిన వెంకాయమ్మ (62), కురాకుల కోటేశ్వరరావు (50) కూడా కిడ్నీ సమస్యతో నే మృతిచెందినట్లు వివరిస్తున్నారు. వీరందరు విజయవాడలోని పలు ప్రైవేటు ఆసుపత్రిల్లో చికి త్స పొందగా, వీరికి కిడ్నీ వ్యాధి ఉన్నట్లు వైద్యులు రిపోర్టులు కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news