ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్.. ఈసారి బీజేపీకి షాక్ !

-

ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేళ జోరుగా ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తున్నారు అధికార పార్టీ నేతలు. శ్రీకాకుళం జిల్లా పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో అత్యధిక వార్డులను గెలిచి మున్సిపల్ ఛైర్మన్ కుర్చీని కైవసం చేసుకునేందుకు మంత్రి సీదిరి అప్పలరాజు వేగంగా పావులు కదుపుతున్నారు. మొన్న టీడీపీ నుంచి నలుగురు కౌన్సిలర్ అభ్యర్ధులను వైసీపీలో చేర్చుకుని టీడీపీకి షాక్ ఇచ్చిన మంత్రి తాజాగా బీజేపీ తరఫున నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులను వైసీపీలో జాయిన్ చేసేసుకుని కమలం పార్టీ నేతలకు ఝలక్ ఇచ్చారు.

26వ వార్డు తరఫున నామినేషన్ వేసిన మల్లా రమ్య , 21వ వార్డు నుంచి నామినేషన్ వేసిన దేవరశెట్టి బాలాజీ గుప్తా కొద్ది సేపటి క్రితం మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీని వీడి వైసీపీలో చేరిన ఇద్దరు కౌన్సిలర్ అభ్యర్ధులకు మంత్రి అప్పలరాజు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులకు గాను 135 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ మున్సిపాలిటీలో మొత్తం 9 వార్డులకు బీజేపీ నామినేషన్లు దాఖలు చేయగా అందులో ఇద్దరిని వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ లో లాగేయడంతో ఇప్పుడు మిగతా అభ్యర్ధులు ఉంటారా వారూ జెండా పీకేస్తారా ? అనే చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version