భారత్ మీద మరోసారి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు మసూద్ అజార్ తన ఆక్రోశం వెల్లగక్కాడు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా బవహల్పూర్ లోని జైష్-ఎ-మహమ్మద్ ప్రధాన స్థావరం సుభాన్ అల్లా కాంప్లెక్స్‌పై ఇండియన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో జైష్-ఎ-మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఫ్యామిలీలో మొత్తం 14 మంది కుటుంబ సభ్యులు హతమయ్యారు.
అందులో అతడి అక్క, బావ, మేనల్లుడు, భార్య కూడా ఉన్నారు.దీంతో ప్రధాని నరేంద్ర మోడీపై విషం కక్కతూ.. మసూద్ అజార్ తాజాగా ఓ లేఖను విడుదల చేశాడు. తాను కూడా ఈ దాడుల్లో చనిపోయి ఉంటే బాగుండేదని మసూద్ అజార్ ప్రస్తావించాడు.అయితే, మోడీ కశ్మీర్ విషయంలో అన్ని నియమాలను ఉల్లంఘించారని, భారత్ మీద తప్పక ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరించారు. ఇండియాపై ఇక ఏ మాత్రం జాలి చూపనని.. భయం లేదు.. నిరాశ లేదు.. దుఖం లేదని లేఖలో రాసుకొచ్చాడు.