కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవొద్దని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దేశాన్ని, సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడినా, పోస్టులు పెట్టినా కేసులు పెడతామని పేర్కొన్నారు. సరిహద్దుల్లో భారత్ యుద్ధం చేస్తున్న సమయంలో అందరం బాధ్యతాయుతంగా ఉండాలని కోరారు.

ముఖ్యంగా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడొద్దన్నారు పవన్ కళ్యాణ్. ఇది ఆరంభం మాత్రమే.. ఉగ్రవాదంపై యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుందన్నారు పవన్ కళ్యాణ్. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం నేర్పించాలి.. ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్రం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.