ఆపరేషన్ సిందూర్ 2.0.. ఎల్‌వోసీ వెంబడి పాక్ ఆర్మీ పోస్టు ధ్వంసం..వీడియో

-

ఆపరేషన్ సిందూర్ 2.0 కొనసాగుతోంది. నిన్న రాత్రి పాక్ గగనతలం నుంచి వచ్చిన మిసైల్స్,డ్రోన్లను ఇండియన్ ఆర్మీ సమర్ధవంతంగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎల్ వోసీ వెంబడి కాల్పులకు తెగబడుతున్న పాక్ ఆర్మీ పోస్టును మిసైల్ ద్వారా పేల్చేసినట్లు భారత సైన్యం పేర్కొంది. దీనికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేసింది.

అంతేకాకుండా, యుద్ధానికి సంబంధించి సైతం ఓ పోస్టు పెట్టింది. ‘డ్రోన్లు, ఇతర మందుగుండు సామాగ్రితో పశ్చిమ సరిహద్దుల్లో పాక్ సాయుధ దళాలు దాడులకు పాల్పడుతున్నాయని.. జమ్ముకశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని.. పాక్ దాడులను సమర్థవంతంగా భారత సైన్యం తిప్పికొట్టిందని.. దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని’ భారత్ ఆర్మీ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news