పాక్ కవ్వింపు చర్యలను భారత్ సీరియస్‌గా తీసుకున్నది.నిన్న సాయంత్రం ఒక్కసారిగా భారత్‌లోని 15 నగరాల్లో లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్ముకాశ్మీర్లోని కీలక ప్రాంతాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుని మిసైల్, వైమానిక దాడులకు పాల్పడింది.
పాక్ దాడిని భారత త్రివిద దళాలు, ఎస్-400 రక్షణ వ్యవస్థ సాయంతో క్షిపణి దాడులకు పాల్పడింది. అయితే, రెండు దేశాల నడుమ భీకర యుద్ధం జరుగుతున్న తరుణంలో పాక్ పౌరులు తమ దేశానికి మద్దతుగా నిలవకుండా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలని పీటీఐ కార్యకర్తలు పెద్దఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇస్లామాబాద్‌లో అర్ధరాత్రి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనుచరుల నిరసన ర్యాలీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.