మాకు అప్పులు ఇవ్వండి.. పాకిస్తాన్‌ పోస్ట్ వైరల్

-

భారత్‌ దెబ్బకు పాక్‌ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. భారత్‌ దాడులతో భారీ నష్టాలు వచ్చాయని పాక్‌ ట్వీట్ చేసారు. పాకిస్తాన్‌కు మరిన్ని లోన్లు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. యుద్ధ పరిస్థితులు, స్టాక్స్‌ పడిపోవడం వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని తెలిపారు.
సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలని ట్వీట్‌ చేశారు పాకిస్తాన్‌ ఆర్థిక శాఖ.

Pakistan tweets that it has suffered heavy losses due to Indian attacks
అటు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పరార్ అయ్యాడు. ఇస్లామాబాద్ లోని పాక్ ప్రధాని నివాసానికి అతి సమీపంలో భారత్ మిస్సైల్ అటాక్ చేసింది. సురక్షిత ప్రాంతానికి షెహబాజ్ తరలించారు. కుటుంబంతో సహా ప్రత్యేక విమానంలో విదేశాలకు పారిపోయినట్లు సమాచారం అందుతోంది. అజ్ఞాతంలోకి పాక్ ప్రధానితో పాటు ఆర్మీ చీఫ్ వెళ్ళాడు.

ఇది ఇలా ఉండగా ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. నియంత్రణ రేఖ వెంబడి దాయాది సైన్యం కాల్పులు జరుపుతోంది. వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలోనే భారత సైన్యం నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ ఆర్మీ శిబిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. దానికి సంబంధించిన వీడియోను సైతం భారత సైన్యం విడుదల చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news