భారత్ లక్ష్యం పాకిస్థాన్ కాదు.. ఉగ్రవాదులు మాత్రమే: రాజ్‌నాథ్ సింగ్

-

భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉగ్రవాద శిబిరాలపై భారత సైనికులు అర్ధరాత్రి ప్రత్యేక దాడులు నిర్వహించి, అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారని ఆయన ప్రశంసించారు. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) చేపట్టిన ప్రాజెక్టుల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “మన సైనికులు రాత్రికి రాత్రే విపరీతమైన శౌర్యాన్ని చూపారు. పౌరులపై ప్రభావం లేకుండా, కేవలం ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేయడం ద్వారా ప్రపంచానికి మన నిబద్ధతను చాటారు” అని మంత్రి తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలు కోల్పోవడం నేపథ్యంలోనే ఈ చర్యలు చేపట్టామని చెప్పారు.

ఈ ఆపరేషన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, దేశ రక్షణ విషయంలో కఠినమైన నిర్ణయాలపై మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. “భారత లక్ష్యం పాకిస్థాన్ కాదు – ఉగ్రవాదమే” అని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు భద్రతపై భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని రాజ్‌నాథ్ అన్నారు. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్ ఈ దాడుల్లో మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై యథాశక్తిగా దాడులు నిర్వహించింది. పాకిస్థాన్ సైనిక సదుపాయాలను మాత్రం ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయలేదని, ఉద్రిక్తతలు పెరగకుండా చర్యలు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.

 

Read more RELATED
Recommended to you

Latest news