కొమురం భీంజిల్లాలో ‘ఆపరేషన్ టైగర్’.. నిన్నటి నుండి అడవిలోనే అధికారులు !

-

కొమురం భీం జిల్లాలో ఆదివాసీల ని ఇబ్బంది పెడుతున్న పెద్దపులి ఇంకా చిక్కలేదు. గిరిజనుల ప్రాణాలు తీసిన పులిని బంధించేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. పులిని బంధించేందుకు తెలంగాణ అటవీ శాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. బెజ్జూరు మండలం  కంది భీమన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏ2 పులిని ఇప్పుడు పట్టుకోవాలని చూస్తున్నారు. దానిని బంధించేందుకు గాను నిన్నటి నుంచి అధికారులు అడవుల్లోనే ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఇప్పటికే పులికి మత్తుమందిచ్చె బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. రంగంలోకి రెస్క్యూ టీమ్, మత్తు మందు నిపుణులు, షూటర్లు అందరూ దిగినట్టు చెబుతున్నారు. పులి సంచరించే ఎనిమిది ప్రాంతాలను గుర్తించిన అటవీశాఖ ఎనిమిది ప్రాంతాలలో మంచెలు ఏర్పాటు చేసి వాటి మీద నుంచి షూట్ చేసి మత్తుమందు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అది కాకుండా పులిని బంధించేందుకు మరిన్ని బొన్లు కూడా ఏర్పాటు చేశారు. 10బోన్లు, 110కెమెరాల ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. ఈ ఆపరేషన్ లో 60మంది టైగర్ ట్రాకర్స్, మహారాష్ట్ర నిపుణులు కూడా పాల్గొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version