మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఎ12ను భారత్‌లో సోమవారం విడుదల చేసింది. ఇందులో 6.2 ఇంచుల హెచ్‌డీ ప్లస్ వాటర్ డ్రాప్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌తోపాటు ఫోన్‌ను 3, 4 జీబీ ర్యామ్ ఆప్షన్లలో అందిస్తున్నారు. అలాగే 32, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు లభిస్తున్నాయి. ఆండ్రాయిడ్ 9.0పై ఆధారంగా ఈ ఫోన్ పనిచేస్తుంది. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఏర్పాటు చేశారు. 13, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. డెడికేటెడ్ డ్యుయల్ సిమ్, మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్లను ఏర్పాటు చేశారు. 4230 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఇందులో లభిస్తోంది.
ఒప్పో ఎ12 స్పెసిఫికేషన్లు…
* 6.22 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* 1520 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెసర్
* 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్
* 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్
* 13, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 4.0, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ
ఒప్పో ఎ12 కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.9,990గా ఉంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.11,490గా ఉంది. జూన్ 10వ తేదీ నుంచి అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లు, ఆన్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. దీనిపై 6 నెలల వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీని ఉచితంగా అందిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు ఈఎంతో 5 శాతం, ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డు ఈఎంఐతో 5 శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నారు. అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులతో 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందివ్వనున్నారు.