టాలీవుడ్‌కు గుడ్‌న్యూస్‌.. షూటింగ్‌ల‌కు అనుమ‌తి..!

-

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి తెలంగాణ సీఎం కేసీఆర్ శుభ‌వార్త చెప్పారు. రాష్ట్రంలో సినిమాలు, టీవీల షూటింగ్‌ల‌ను నిర్వ‌హించుకునేందుకు అనుమ‌తిచ్చారు. ఈ మేర‌కు ఆయ‌న సంబంధిత ఫైలుపై సోమ‌వారం సంత‌కం చేశారు. దీంతో రాష్ట్రంలో ఇక మ‌ళ్లీ సినిమాలు, టీవీ కార్య‌క్ర‌మాల షూటింగ్ సంద‌డి మొద‌లుకానుంది.

కాగా ఇప్ప‌టికే తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి చెందిన పెద్ద‌లు మంత్రి త‌ల‌సానితో స‌మావేశం కాగా.. మంగ‌ళ‌వారం ఏపీ సీఎం జ‌గ‌న్‌తోనూ వారు స‌మావేశం కానున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ అనుమ‌తులు రావ‌డం సినీ రంగానికి చెందిన వారికి ఎంత‌గానో ఊర‌ట క‌లిగించింది. అయితే థియేట‌ర్లు మాత్రం ఇప్పుడ‌ప్పుడే ప్రారంభం కావ‌ని అధికారులు తెలిపారు. కేంద్రం ఇంకా అందుకు సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేయ‌లేద‌ని, క‌నుక ఇప్ప‌టికైతే షూటింగ్‌లు మాత్ర‌మే నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని తెలిపారు.

షూటింగ్‌ల‌లో న‌టీన‌టులు, ఇత‌ర టెక్నిషియ‌న్లు, సిబ్బంది క‌రోనా జాగ్ర‌త్త‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సి ఉంటుంది. దీనిపై మ‌రిన్ని సూచ‌న‌ల‌ను తెలంగాణ రాష్ట్రం విడుద‌ల చేయనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version