రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణికులకు ఆహారం విషయంలో ఇబ్బందులు కలగొచ్చు. అయితే ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్త ఫీచర్స్, సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. రైల్వే ప్రయాణికులు కోరుకున్న హోటల్ నుంచి తమకు కావాల్సిన ఆహార పదార్థాలను బెర్త్ వరకు పొందేలా సర్వీస్ ని తీసుకు వచ్చింది. పూర్తి వివరాలని చూస్తే..
ఐఆర్‌సీటీసీ యాప్ లేదా ఇతర థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఫుడ్ పొందొచ్చు. వాట్సప్‌లోనే రైల్వే ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఫుడ్ ఆన్ ట్రాక్, www.catering.irctc.co.in వెబ్‌సైట్ల ద్వారా రైల్వే ప్రయాణికులకు ఈ సేవలని అందిస్తోంది. +918750001323 నెంబర్‌కు వాట్సప్ లో మెసేజ్ పంపించి… ఫుడ్ డెలివరీ సేవల్ని పొందొచ్చు. ఈ సర్వేస్ ప్రస్తుతానికి కొన్ని రైళ్లకే వుంది. ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాత ఇతర రైళ్లల్లో కూడా సేవలని తీసుకు రానుంది. ఐఆర్‌సీటీసీ అందిస్తున్న వాట్సప్ సేవల్ని మీరు కూడా రైలు లో వెళ్ళినప్పుడు ఉపయోగించుకోవచ్చు.
స్మార్ట్‌ఫోన్‌లో +918750001323 నెంబర్ ని సేవ్ చేసి పెట్టుకోండి.
www.catering.irctc.co.in ఓపెన్ చేసి పీఎన్ఆర్ నెంబర్ ని ఎంటర్ చేసేయండి.
వాట్సప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ఒక లింక్ వస్తుంది.
ఆ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి.
పేమెంట్ పూర్తి చేస్తే ఫుడ్ ఆర్డర్ ప్రాసెస్ పూర్తవుతుంది.
జూప్‌తో కలిసి వాట్సప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే సర్వీస్ ని స్టార్ట్ చేసారు.
రైల్వే ప్రయాణికులు జూప్ ఛాట్‌బాట్ నెంబర్ +917042062070 కి పీఎన్ఆర్ నెంబర్ మెసేజ్ చేసి ఫుడ్ ని పొందొచ్చు.