OTT: ఫిబ్రవరిలో ఓటీటీలోకి వచ్చే సూపర్ హిట్ చిత్రాలు ఇవే..!

-

ప్రస్తుతం ఫిబ్రవరిలో ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సూపర్ హిట్ చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా థియేటర్లలో సందడి చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న కొన్ని సినిమాలు నాలుగు వారాలకే ఓటీటీ లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వస్తే.. మరికొన్ని ఎనిమిది వారాలకు రిలీజ్ అవుతాయి. అయితే వచ్చే నెలలో మాత్రం సంక్రాంతి సినిమాలు ఓటీటీ లోకి వస్తాయని స్పష్టం అవుతుంది. అయితే ఏ సినిమా ? ఏ ఓటీటి ప్లాట్ఫామ్ పై స్ట్రీమింగ్ కానుంది? అనేది ఇప్పుడు చూద్దాం.

వరిసు:
విజయ దళపతి హీరోగా తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన చిత్రం వరిసు. ఈ చిత్రం తమిళంలో జనవరి 11వ తేదీన.. తెలుగులో జనవరి 14వ తేదీన విడుదలైంది. రెండు భాషల్లో కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించి థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 10వ తేదీన స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

తునివు:
హెచ్ వినోత్ దర్శకత్వంలో అజిత్ కుమార్ , మంజు వారియర్ జంటగా వచ్చిన సినిమా తునివు. జనవరి 11వ తేదీన తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైంది. మాస్ యాక్షన్ మూవీ సినిమా ఇది. ఫిబ్రవరి 10వ తేదీన నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

ఈ చిత్రాలతో పాటు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య.. ఫిబ్రవరి రెండో వారంలో నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవడానికి సిద్ధంగా ఉంది. మరొకవైపు బాలకృష్ణ హీరోగా వచ్చిన వీర సింహారెడ్డి సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 3వ వారం నుంచి స్ట్రీమింగ్ అవుతోందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రాల ఓటిటి వేదికపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version