కాలం చెల్లిన మందులు..గిరిజన విద్యార్థులంటే అంత చిన్నచూపా : హరీశ్ రావు

-

కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన విద్యార్థులతో అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ అయ్యారు. వరుస ఫుడ్ పాయిజన్స్ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌లో కాలం చెల్లిన మందులు వాడుతున్నారని మాజీ మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ‘ఎక్స్’ వేదికగా దవాఖానలో కాలం చెల్లిన మందులు అనే వార్తను పోస్ట్ చేశారు.

ఇంతకంటే నిర్లక్ష్యం మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. గిరిజన గురుకుల విద్యార్థుల ప్రాణాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత చిన్న చూపా? అని నిలదీశారు. ఈ మందుల వలన పిల్లల ప్రాణాల మీదకు వస్తే ఎవరు బాధ్యులు? అని ప్రశ్నించారు. కాలం చెల్లిన మందులు మెడికల్ క్యాంపులోకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఇంత జరుగుతుంటే జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు,ఇతర ప్రజాప్రతినిధులకు పట్టించుకునే తీరిక లేదా? అని, కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర ఇంకెప్పుడు వీడుతుంది?అని తీవ్ర విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news