కుటుంబ సర్వే వల్ల సంక్షేమ పథకాల కోత ఉండదు..ఆందోళన చెందవద్దు అని కోరారు మంత్రి పొన్నం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కుల గణన, సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం మాట్లాడారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ… కుటుంబ సర్వే ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే, తెలంగాణలో చరిత్మాత్మక ఘట్టం అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 87 వేల మంది ఎన్యుమరేటర్లతో సర్వే కొనసాగతోందని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్.
సర్వే వల్ల సంక్షేమ పథకాల కోత ఉండదు, ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు. సర్వే సమాచారం అంతా గోప్యంగా ఉంచబడుతుంది, అన్ని రకాల అసమానతలు తొలగించేందుకే సర్వే అన్నారు. హైదరాబాద్ లో పలుచోట్ల కొందరు ఇబ్బందులు కలిగించారు, అది సరైనది కాదని వివరించారు. కేవలం కులాల యొక్క జనాభా తెలుసుకొనేందుకే ఈ సర్వే చేస్తున్నామన్నారు. సర్వేలో అన్ని వర్గాల ప్రజలు భాగ స్వాములు కావాలని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్.