వక్ఫ్ బోర్డుపై ఒవైసీ బ్రదర్స్ నిజాలు చెప్పాలి : ఎమ్మెల్యే రాజాసింగ్

-

వక్ఫ్ బోర్డుపై ముస్లిం సోదరులకు ఓవైసీ బ్రదర్స్ నిజాలు చెప్పాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు. దమ్ముంటే వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా పెట్టిన బహిరంగ సభలో నిజం చెప్పే ప్రయత్నం చేయాలన్నారు. వక్ఫ్ బోర్డు భూములను అమ్ముకుంది, కబ్జా చేసింది ఒవైసీ బ్రదర్స్ అని చెప్పారు. భూములను లీజుకు ఇచ్చింది కూడా ఒవైసీ బ్రదర్సే అని విమర్శించారు. అప్పుడు దేవుడి భూములు అని గుర్తుకు రాలేదా? అని మండిపడ్డారు.

కేంద్రం ఆ భూములను కాపాడేందుకే మంచి చట్టాన్ని తీసుకువచ్చింది అని చెప్పారు. వక్ఫ్ బోర్డుకు 9 లక్షల 50 వేల ఎకరాల భూములు ఉన్నాయని వాటిపై వచ్చే ఆదాయం ఏమవుతోందని ప్రశ్నించారు.భూముల్లో వ్యవసాయ భూములతో పాటూ షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్న భూములు సైతం ఉన్నాయని తెలిపారు. ఆ భూములను ఎవరికీ అమ్ముకునేందుకు వీలు లేకుండా, తక్కవ ధరకు లీజుకు ఇవ్వకుండా ఉండేందుకు ఈ చట్టం తీసుకువచ్చారన్నారు.కానీ, ఈ నిజాన్ని చెప్పే దమ్ము ఒవైసీకి లేదన్నారు.వక్ఫ్ బోర్డు బిల్లుపై వ్యతిరేకంగా మాట్లాడటమే ఒవైసీ ఆలోచన అని చెప్పారు.ముస్లిం సమాజం మేలుకోవాలని ఒవైసీని నమ్మవద్దన్నారు. లేదంటే మీరే నష్టపోతారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు శనివారం ఓ వీడియో సందేశాన్ని విడుదలచేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news