ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయొద్దు అంటూ KTR ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనే అంశంపై కీలక వ్యాఖ్యలు చేసారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్. ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయొద్దన్నారు. ఆ రోజు ఎన్నికల్లో పాల్గొనవద్దని వెల్లడించారు. ఎవరూ ఓటు కు వెళ్లకుండా విప్ కూడా ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉన్న మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, కార్పొరేటర్లు ఎవరూ ఓటు కు వెళ్లొద్దని హెచ్చరించారు. ఎవరైనా విప్ ధిక్కరించి వోటింగ్ కు వెళితే వారిపై చర్యలు ఉంటాయన్నారు కేటీఆర్. ఓటు ఉన్న వాళ్లకు విప్ ఇవ్వాలని తలసాని, సబిత ఇంద్రారెడ్డి లను కోరారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్.