ఆక్స్ఫర్డ్ తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకాకు యుకె ప్రభుత్వం నుండి అనుమతి లభిస్తే పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ కు ఆక్స్ఫర్డ్ కరోనావైరస్ వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగ అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే అవకాశం ఉండవచ్చు. ఈ విషయాన్ని నితి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్ శనివారం చెప్పారు. ఇండియాలో క్లీనికల్ ట్రయల్స్ స్క్రిప్ట్ ప్రకారం వెళితే, మూడవ దశ ట్రయల్స్ 2021 జనవరి-ఫిబ్రవరి నాటికి ముగిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కోవిడ్ -19 కోసం వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పై నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ చైర్మన్ వినోద్ పాల్ మాట్లాడుతూ, ఆస్ట్రాజెనెకాకు అనుమతి లభిస్తే… కచ్చితంగా అత్యవసర వినియోగానికి భారత డ్రగ్ రెగ్యులేటర్ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిజిసిఐ) అనుమతి ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ వ్యాక్సిన్ కోసం మేము అత్యవసర అనుమతిని యుకె ప్రభుత్వాన్ని అడుగుతున్నామని చెప్పారు.