పీవీ సింధు అందుకున్న అవార్డులు, సృష్టించిన రికార్డులు మరెన్నో..

-

పూసర్ల వెంకట సింధు (PV Sindhu) ఎంతో పాపులర్ అయినా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఎన్నో గొప్ప విజయాల్ని, అవార్డుని పొందింది సింధు. ఈమె 2016 లో జరిగిన రియో ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించి ఒలింపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళా. ఇక సింధు గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలని మనం ఇప్పుడే చూసేద్దాం. ఇక మరిన్ని వివరాలలోకి వెళితే..

పీవీ సింధు | PV Sindhu

2012 సెప్టెంబరు 21 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకోవడంతో సింధుకు మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఇలా ఒకటా రెండా ఎన్నో విజయాల్ని ఈమె అందుకుంది.

పీవీ సింధు కుటుంబం:

సింధు 1995 జూలై 5 న పి. వి. రమణ, పి. విజయ దంపతులకు హైదరాబాదులో జన్మించింది. తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాలీబాల్ క్రీడాకారులు. సింధు తండ్రి పూర్వీకులు పశ్చిమ గోదావరి జిల్లా జిల్లాకు చెందిన వారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో జన్మించాడు. అయితే అతనికి రైల్వేలో ఉద్యోగం రావడంతో తన వాలీబాల్ కెరీర్ కోసం హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు.

PV Sindhu Family

ఇది ఇలా ఉంటే సింధు పుల్లెల గోపీచంద్ స్ఫూర్తితో బ్యాడ్మింటన్ ఆడడం మొదలు పెట్టింది. అప్పటికి గోపీచంద్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ పోటీలలో గెలిచారు. సింధు ఎనిమిదేళ్ళ వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడటం మొదలు పెట్టింది.

సింధు అందుకున్న అవార్డులు, సృష్టించిన రికార్డులు:

2009 సబ్ జూనియర్ ఏషియన్ బాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ కొలంబో లో బ్రాంజ్ మెడల్ పొందింది.

2010 Iranj Fajr ఇంటెర్నేషన్ బ్యాడ్మింటన్ ఛాలెంజ్ లో రజత పతకాన్ని దక్కించుకుంది.

2012 జూలై 7 న, ఆమె ఫైనల్లో జపనీస్ క్రీడాకారిణి నోజోమి ఒకుహారాను ఓడించి ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌ లో గెలిచింది.

మాజీ ప్రపంచ నంబర్ 2 పివి సింధు ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరుకున్న తొలి భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు.

బ్రెజిల్‌లోని రియో ​​డి జనీరోలో జరిగిన 2016 ఒలింపిక్ క్రీడల్లో ఆమె రజతం సాధించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ కాంస్యం సాధించిన తరువాత, ఒలింపిక్స్‌లో పోడియంలో పూర్తి చేసిన రెండవ భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కూడా ఈమెనే.

2016 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని పొందింది. అంతే కాకుండా 2015 లో పద్మశ్రీ మరియు 2020 లో పద్మ భూషణ్లను కూడా అందుకుంది సింధు.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ పతకాలు సాధించిన రెండవ మహిళా సింధునే.

pv sindhu

2019 లో స్వర్ణం సాధించడమే కాకుండా, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఐదు లేదా అంత కంటే ఎక్కువ పతకాలు సాధించింది. 2019 లో ఆమె స్వర్ణంతో పాటు రెండు కాంస్య పతకాలు (2013, 2014)  రెండు రజత పతకాలు (2017, 2018) గెలుచుకున్నారు.

కామన్వెల్త్ గేమ్స్ మరియు ఆసియా గేమ్స్ వంటి అనేక అంతర్జాతీయ మీట్లలో సింధు అనేక పతకాలు సాధించారు. జకార్తాలో జరిగిన 2018 ఆసియా క్రీడల్లో రజత పతకం ఆమె సాధించిన విజయాలలో ఒకటి. భారతదేశం కోసం ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించిన తొలి మహిళా షట్లర్ సింధు.

2019 లో స్విట్జర్లాండ్‌లో జరిగిన బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు బంగారు పతకం పొందారు.

పూసర్ల వెంకట సింధు విజయాలు:

2012 Li Ning China Masters super series పోటీ లో లండన్ ఒలంపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ ని ఓడించింది.

2013 ఆగస్టు 10 న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించి, ఆ పతకం గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది.

PV Sindhu Receving Padma Shri Award

2015 మార్చి 30 న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రధానం చేసింది.

అలానే 2016 ఆగస్టు 18 న రియో ఒలింపిక్స్ లో జరిగిన సెమీఫైనల్లో జపాన్ కో చెందిన నోజోమీ ఒకుహరాను ఓడించి ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. ఇలా సింధు తన కెరీర్ లో విజయాల్ని అందుకుంది.

pv sindhu at rio olymipics

రియో ఒలింపిక్స్ లో సింధు సిల్వర్ మెడల్ పొందాక బాగా పాపులర్ అయ్యిపోయింది.

pv sindhu appointed as deputy collector

రియో ఒలింపిక్స్ లో సింధు సిల్వర్ మెడల్ పొందాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ కింద అపాయింట్ చెయ్యడం జరిగింది.

జపాన్ క్రీడాకారిణి ఓడించి 2018 లో వరల్డ్ టూర్ టైటిల్ ని పొందింది.

pv sindhu with sachin Tendulkar and pullela gopichand

సింధు సచిన్ టెండూల్కర్ ని రోల్ మోడల్ గా తీసుకుంది. అలానే పుల్లెల గోపిచంద్ ఆమెకి ఆదర్శం.

pv sindhu on GRAZIA Magazine

సింధు పాపులర్ మ్యాగజైన్స్ అయిన GRAZIA, JFW, ELLE వంటి వాటి కవర్ పైన కనపడడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version