అభినందన్ పిస్టల్ ను తిరిగివ్వని పాక్.. ఎందుకంటే?

-

భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను పాక్.. భారత్ కు అప్పగించేముందు ఆయన పిస్టల్ ను తిరిగి ఇవ్వలేదు. ఆయన వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో కొన్నింటిని మాత్రమే తిరిగిచ్చింది. అయితే.. అభినందన్ దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ అప్పగిస్తామని ప్రకటించిన పాక్.. అభినందన్ కు చెందిన వేలి ఉంగరం, చేతి గడియారం, కంటి అద్దాలు తప్పితే మిగితా వస్తువులేమీ అప్పగించలేదు.

ముఖ్యంగా వర్ధమాన్ పాక్ ఆర్మీకి చిక్కినప్పుడు ఆయన వద్ద ఉన్న పిస్టల్, మ్యాప్, సర్వైవల్ కిట్ ను పాక్ భారత్ కు అప్పగించలేదు. ప్యారచూట్ ద్వారా అభినందన్ పీవోకేలో దిగినప్పుడు.. అక్కడి స్థానికులు ఆయనపై దాడి చేశారు. ఆ సమయంలో అభినందన్ తన దగ్గర ఉన్న పిస్టల్ తో గాల్లోకి కాల్పులు జరిపినట్టు పాక్ తెలిపింది. అందుకే పాక్ అభినందన్ పిస్టల్ ను భారత్ కు అప్పగించి ఉండకపోవచ్చని భారత్ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు పాకిస్థాన్ ఆయనను యుద్ధ ఖైదీగా పరిగణించింది. కానీ.. భారత్ మాత్రం దాన్ని వ్యతిరేకించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version