భారీ ఉగ్ర దాడికి పాక్‌ కుట్ర..భగ్నం చేసిన ఇండియన్‌ ఆర్మీ!

-

జమ్మూకార్మీర్‌లో భారీ కుట్రకు పాక్ ప్లాన్ చేసింది..పాక్‌ కుట్రలను భారత ఆర్మీ చేదించింది..ఉత్త‌ర క‌శ్మీర్‌లోని కీర‌న్ సెక్టార్‌లో పాకిస్థాన్ ఆర్మీ సాయంతో పీవోకే‌లో ఉగ్ర‌వాదులు అక్రమంగా స‌ర‌ఫ‌రా చేస్తున్న ఆయుధాల‌ను  ఇండియన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్న‌ది.. కిష‌న్ గంగా న‌ది స‌మీపంలో ఉగ్ర‌వాదులు ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు భార‌త ఆర్మీ ద‌ళాలు గుర్తించాయి..నాలుగు ఏకే 74 రైఫిళ్లు, 8 మ్యాగ్జిన్లు, 240 ఏకే రైఫిల్ అమ్యూనిష‌న్‌ను స్వాధీనం చేసుకున్నారు..దీంతో వెంట‌నే ఇండియ‌న్ ఆర్మీ జ‌మ్మూక‌శ్మీర్ పోలీసులతో క‌లిపి జాయింట్ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టింది. కిష‌న్ గంగా న‌దికి అవ‌త‌ల వైపు పీవోకే ప్రాంతంలో ముగ్గురు ఉగ్ర‌వాదులు ఓ ట్యూబ్‌ను తాడుకు క‌ట్టి ఆయుధాలు సర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు గుర్తించారు. అయితే ఆ ప్రాంతానికి వెళ్లిన భ‌ద్ర‌తా ద‌ళాలు.. ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్నాయి.

గ‌త ఏడాది పాకిస్థాన్ నుంచి 130 మంది అక్ర‌మంగా ప్ర‌వేశించార‌ని, ఈ ఏడాది ఆ సంఖ్య 30 క‌న్నా త‌క్కువ‌గానే ఉంద‌న్నారు లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ బీఎస్ రాజు..ఈ ఏడాది స‌రిహ‌ద్దు చొర‌బాట్ల‌ను చాలా వ‌ర‌కు అడ్డుకున్న‌ట్లు చినార్ కార్ప్స్ తెలిపారు. ఈ ప‌రిస్థితి వ‌ల్ల అంత‌ర్గ‌తంగా కూడా భ‌ద్ర‌త పెరుగుతుంద‌న్నారు. మ‌న ద‌ళాలు నిత్యం అప్ర‌మ‌త్తంగా ఉంటున్నాయ‌ని, నిఘా డివైస్‌ల ద్వారా పాక్ నుంచి స్మ‌గ్లింగ్ అయిన ఆయుధాల‌ను ప‌ట్టుకున్నామ‌ని, ఇది ఆ దేశ ఉద్దేశాల‌ను తెలుపుతుంద‌ని ఆయ‌న అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version