ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ పాకిస్తాన్ మీద దాడి చేయడంపై అక్కడి పౌరులు గరం అవుతున్నారు. అయితే, వాళ్లు భారత్‌ను నిందించకుండా సొంత దేశాన్నే నిందితుండటం గమనార్హం. ఈ మేరకు పాక్ పౌరుడు ఒకరు సోషల్ మీడియాలో వీడియో సందేశాన్ని పెట్టాడు. ప్రస్తుతం అది కాస్త వైరల్ అవుతోంది.
ఆపరేషన్ సిందూర్ విజయవంతం అవ్వడంపై పాకిస్తాన్ రక్షణ వ్యవస్థపై ఆ దేశ పౌరుడి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ మిసైల్స్ దాడి చేస్తే పాక్ అడ్డుకోలేకపోయింది.పైగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకుంది. ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ దాడి చేసిందని, పాక్‌లోని ఇతర ప్రాంతాల్లో భారత్ దాడి చేసినా చేసేదేమీ లేదని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.