ఐదో రోజూ LOC వద్ద పాక్ కాల్పులు జరిగాయి. మరోసారి కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్ సైన్యం. జమ్మూకశ్మీర్లోని అక్నూర్ సెక్టార్లో పాక్ రేంజర్ల కాల్పులు జరిగాయి. నిన్న అర్ధరాత్రి కూడా కుప్వారా, బారాముల్లా ప్రాంతాల్లో పాక్ కాల్పులకు తెగబడినట్లు సమాచారం అందుతోంది. పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టింది ఇండియన్ ఆర్మీ.

అలాగే పాక్ తో యుద్ధం… ఇండియా నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్లోని 87 ప్రదేశాల్లో 48 టూరిస్ట్ ప్రాంతాలను మూసివేసింది. మిగతా ప్రాంతాల్లో సాయుధ బలగాలతో భద్రతను పెంచింది. మూసివేసిన టూరిస్ట్ ప్రాంతాల్లో త్వరలో భద్రతను కల్పించిన తర్వాత ఆ ప్రాంతాలను ప్రభుత్వం తెరవనుంది.