తెలంగాణలో అప్పుల బాధతో మరో నలుగురు రైతుల ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మీక్యాతండాకి చెందిన అంగోతు నాగు (30) అనే రైతు, తనకున్న 2.20 ఎకరాల్లో వారి సాగు చేశాడు. సాగు నీరు కోసం బోర్లు వేయడానికి రూ.2.20 లక్షలు అప్పు చేశాడు, పంట దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అప్పు తీర్చలేనని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు రైతు.

సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మేగ్యతండాకు చెందిన అంగోతు నాగేశ్వర్ రావు (38) కూడా సూసైడ్ చేసుకున్నాడు. జగిత్యాల రూరల్ మండలం సుమన్ పల్లి చెందిన కోరండ్ల సంతోష్ రెడ్డి(35) అనే రైతు, పెట్టుబడి కోసం లక్షల్లో అప్పు చేశాడు. తనకున్న 3 ఎకరాల్లో 2 ఎకరాలు అమ్మినప్పటికీ అప్పులు తీరకపోవడంతో, తీవ్ర మనస్తాపనంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు సంతోష్ రెడ్డి అనే రైతు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లికి చెందిన లింగాపురం సురేశ్ (30) అప్పు తీర్చే మార్గం కానరాక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు రైతు.