ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఉత్కంఠ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత పాక్ బ్యాటర్లు విజృంబించగా.. ఆ తరువాత బౌలర్లు రెచ్చిపోయారు. మళ్లీ పాక్ కెప్టెన్ రిజ్వాన్, సౌద్ రెచ్చిపోయారు. ఆ తరువాత భారత బౌలర్లు వరుస ఓవర్లలో వికెట్లు తీసి భారత్ వైపు మ్యాచ్ తిప్పారు. చివరగా రవీంద్ర జడేజా వేసిన 36.1 ఓవర్ కు తయ్యబ్ తామిర్ క్లీన్ బౌల్డ్ కావడం విశేషం.
పాకిస్తాన్ తో మ్యాచ్ లో భారత్ మళ్లీ రేసులోకి వచ్చింది. ప్రమాదకరంగా మారిన రిజ్వాన్, సౌద్ షకీల్ లను మనోళ్లు వెనక్కి పంపించారు. వారిద్దరూ కలిసి 100కి పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. అక్షర్ పటేల్, హార్దిక్, జడేజా వేసిన వరుస ఓవర్లలో ముగ్గురు ఔట్ అయ్యారు. 2 క్యాచ్ లు మిస్ మిస్ అయినప్పటికీ పాక్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. 165 పరుగుల వద్ద పాకిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది.