ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపిన పాక్ పీఎం

-

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. మోడీ ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణం చేశారు.వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మోడీకి దేశ, విదేశాల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అమెరికా, కెనడా, ఇటలీ వంటి అగ్రదేశాల నేతలు మోడీకి అభినందనలు తెలుపగా.. తాజాగా పాకిస్థాన్ ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికైన ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు అని పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం అట్టహాసంగా జరిగిన మోడీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి 7 దేశాల అధినేతలు, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పలువురు సీఎంలు, ఖర్గే, ముకేశ్ అంబానీ, అదానీ, సూపర్ స్టార్ రజినీకాంత్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ సహా 8 వేల మంది ప్రముఖులు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version