ఎన్ని జరుగుతున్నా పాక్ మాత్రం తన బుద్ధి మార్చుకోవడం లేదు. భారత సరిహద్దులో పాకిస్థాన్ ఎప్పటికప్పుడు తన కుటిల ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. పాకిస్థాన్ డ్రోన్లు రాత్రి పూట నియంత్రణ రేఖ వెంబడి చక్కర్లు కొడుతున్నాయని, ఉగ్రవాదుల కోసం ఏకే 47 తుపాకులను కిందకు జారవిడుస్తున్నట్టు జమ్మూ కశ్మీర్ పోలీసులు తాజాగా వెల్లడించారు.
తాజాగా అఖ్నూర్‌లోని ఓ గ్రామంలో దాడులకు వినియోగించే రైఫిల్స్, ఒక పిస్తోల్ గుర్తించినట్టు వారు తెలిపారు. పాక్ కు చెందిన డ్రోన్లు రాత్రిపూట ఓ గ్రామంలో ఆయుధాలు జారవిడుస్తున్నట్టుగా అందిన సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతంలో సోదాలు చేపట్టారు. జాద్ సొహాల్ గ్రామం నుంచి రెండు ఏకే రైఫిల్స్, ఒక పిస్తోల్, మూడు ఏకే మ్యాగజైన్లు, 90 రౌండ్లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.