తెలంగాణా కరోనా అప్డేట్.. 2,176 కేసులు, 8 మరణాలు !

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నా కరోనా కేసులు భారీ గానే నమోదవుతున్నాయి. ఏరోజూ 2 వేలకు తక్కువగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 2,176 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,79,246 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో 8 మంది మరణించారు. ఇప్పటి వరకు 1070 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 30,037గా ఉన్నాయి.

coronavirus 8 high risk zones in telangana

ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,48,139 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 82.64 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 81.42 శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.59%గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 55,318 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 26,84,215 పరీక్షలు చేసారు. నిన్న ఒక్క రోజే 2,004 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా అంటే 308 కేసులు నమోదయ్యాయి. అలానే రంగారెడ్డి జిల్లాలో కూడా 168 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version