పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను చంపేందుకు కుట్ర..!

-

అసలే పీలకల్లోతు అప్పులు, ద్రవ్యోల్భనం, టెర్రరిజం ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్థాన్ తో ఇప్పుడు రాజకీయ సంక్షోభం తలెత్తింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను గద్దె దించేందుకు ప్రతిపక్షాలను అన్నీ ఏకం అయ్యాయి. దీంతో పాక్ ప్రధాని గద్దె దిగడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు 24 గంటల్లో గద్దె దిగాలని ఆర్మీ అల్టిమేటం జారీ చేసిందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రాణాలకే ప్రమాదం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా తెహ్రిక్ ఇన్సాఫ్ సీనియర్ నాయకుడు ఫైసల్ వావ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ను చంపేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. బహిరంగ సభలకు వెళ్లేటప్పుడు బుల్లెట్ ఫ్రూప్ వాడాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు. ‘అల్లా ఎప్పుడు నన్ను లోకం నుంచి తీసుకెళ్లిపోతే అప్పుడే వెళ్లిపోతాను’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారని ఫైసల్ తెలిపారు. ఇమ్రాన్ ధైర్యవంతుడని.. ఎవరి ముందు తలవంచబోడని ఆయన అన్నారు. పొరుగు దేశాలు దేశంలోని ఎయిర్ బేస్ లను వాడటానికి అనుమతి ఇవ్వబోం అని స్పష్టం చేశారు.

పాక్ లో ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా తన పూర్తి కాలం పదవిలో లేడు. ఎప్పుడూ ఏదో కుట్రతో ప్రధానులను గద్దె దించారు. ప్రధానులను అవినీతి ఆరోపణలు, దేశానికి వ్యతిరేఖంగా కుట్ర పన్నాడనే కారణాలతో హత్య చేసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో ప్రధాని లియాఖత్ అలీఖాన్ ను హత్య చేశారు. ఆ తరువాత జుల్ఫికర్ అలీ భుట్టోను ఉరిశిక్ష ద్వారా చంపేశారు. ఆ తరువాత ప్రధాని రేసులో ఉన్న జెనజీర్ భుట్టోను ఎన్నికల ప్రచారంలో ఉండగా.. హత్య చేశారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version