ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూసిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇవాళ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన… టీమిండియా 20 ఓవర్లలో… ఏడు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. టీమిండియా టాప్ ఆర్డర్ విఫలం కావడంతో.. తక్కువ టార్గెట్ నే పాకిస్తాన్ జట్టు ముందు ఉండగలిగింది టీమిండియా.
ఇండియా బ్యాటింగ్ వివరాల్లోకి వెళితే.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 57 పరుగులు, కీపర్ రిషబ్ పంత్ 39 పరుగులు, రవీంద్ర జడేజా 13 పరుగులు మరియు హార్దిక్ పాండ్యా 11 పరుగులు చేసి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించారు. ఇక అటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ కాగా కె.ఎల్.రాహుల్ మూడు పరుగులకే వెనుదిరిగాడు.
దీంతో కేవలం పాకిస్తాన్ ముందు 152 పరుగుల టార్గెట్ మాత్రమే ఉంచగలిగిన టీమిండియా. ఇక పాకిస్తాన్ బౌలర్లలో.. షాహీన్ అఫ్రిది ఏకంగా మూడు వికెట్లు తీసి టీమిండియా నడ్డి విరిచారు. అఫ్రిదికి తోడుగా హసన్ అలీ రెండు వికెట్లు, మరియు షాబాద్ ఖాన్ మరియు రఫ్ చెరో వికెట్ తీశారు. ఇక 20 ఓవర్లలో పాకిస్థాన్ జట్టు 152 పరుగులు చేయాల్సి ఉంది. మరికాసేపట్లో పాకిస్తాన్ చేజింగ్ ప్రారంభంకానుంది.