Bigg Boss 5 Telugu: ఉత్కంఠగా సాగిన ఎలిమినేట్ ప‌ర్వం.. ఆనీకి ప‌వ‌ర్.. ప్రియ అవుట్

-

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లో ఎవ‌రూ ఊహించిన విధంగా ట్వీస్టుల మ‌ధ్య ఏడో వారం ఎలిమినేష‌న్ ప‌ర్వం ముగిసింది. ఏడో కంటెస్టెంట్ ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయాల్సి వ‌చ్చింది. ఇక కింగ్ నాగార్జున వ‌చ్చి రాగానే.. కంటెస్టెంట్ల‌తో ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. సండే ఫ‌న్ డే అంటునే.. కంటెస్టెంట్ల చెమ‌ట‌లు పట్టించారు. ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ.. ఉత్కంఠ రేపాడు.

ఈ సారి కాస్తా కొత్త‌గా గేమ్ ప్లాన్ చేశాడు. ఆటలు ఆడించాడు. పాటలు పాడించాడు. గెలిచినవారికి బిగ్‌బాస్‌ షీల్డ్‌తో పాటు ఓ స్పెషల్‌ పవర్‌ దక్కుతుందన్నాడు. దశల వారిగా ఆటలు ఆడించాడు. మొద‌ట ‘పట్టుకోండి చూద్దాం’ గేమ్‌ ఆడించాడు. ఇందులో ఓ స‌ర్కిల్ లో ఉన్న పిల్లోస్ ను ఇంటిస‌భ్యులు ద‌క్కించుకోవాలి. ఈ గేమ్ లో ష‌న్ను ద‌గ్గ‌ర ఉన్న ఫిల్లో ను తీసుకుని సిరి గెలిచింది.

ఇక రెండో రౌండ్ ‘చలనచిత్ర వీర’ గేమ్‌ ఆడించాడు. ఇందులో నాగార్జున అడిగినా ప్ర‌శ్న‌ల‌కు ఫ‌స్ట్ బెల్ కొట్టి అన్స‌ర్ ఎవ‌రూ చెప్పారో వాళ్లు గెలిచిన‌ట్టు .. వారే నెక్ట్స్ రౌండ్ కు ఎలిజిబుల్ .. ఇందులో స‌రైన స‌మాధానాలు చెప్పి జెస్సీ, ప్రియాంక, మానస్ గేమ్ గెలిచారు. మిగిలిన వారు ఓడిపోయారు.

ఇక మూడో రౌండ్ .. ‘నీళ్లు-కన్నీళ్లు’ గేమ్‌ ఆడించాడు. ఇందులో జగ్గులు పట్టుకుని స్విమ్మింగ్‌ పూల్‌లోని నీళ్లను వారి క్యాన్‌లో నింపాలి. ఈ రౌండ్‌లో రవి, లోబో ఎలిమినేట్‌ అయ్యారు. అనంతరం నాగ్‌.. లోబో సేఫ్‌ అయినట్లు ప్రకటించాడు. ఈ గేమ్ లో చివరకు విశ్వ, అనీ మాస్టర్ ఫైనల్స్ కి చేరుతారు.

వీరిద్దరికి టోపీల గేమ్ పెట్టారు. ఎవ‌రి టోపీ అయితే.. కింద ప‌డకుండా కాపాడుకుంటారో వారు గెలిచిన‌ట్టు
అని ప్ర‌క‌టించారు. ముందుగా నాక్ అవుట్ అయినా స‌భ్యులు తమకు ఇష్టమైన వారిని ఎంచుకోవచ్చు. అలా కొంతమంది అనీ వైపు, మ‌రి కొంద‌రూ విశ్వ వైపు వెళ్లిపోయారు. ఈ గేమ్ లో అనీ సైడ్ వాళ్లు విశ్వ టోపిని ప‌డేసారు. దీంతో అనీ మాస్ట‌ర్ గేమ్ విన్ అయ్యింది. అలాగే బిగ్ బాస్ ఆమెకు ఓ పవర్ ఇచ్చాడు.
ఆ త‌రువాత ఎలిమినేషన్ ప‌ర్వం ప్రారంభ‌మైంది.

ఎలిమినేష‌న్ లో ఉన్న ఇంటి స‌భ్యుల‌ను గార్డెన్ ఏరియాలోకి పిలిచారు బిగ్ బాస్. ఫ్రూట్స్ బొమ్మలతో నామినేషన్స్ లో ఉన్నవారికి షీట్స్ ఇస్తారు. ఈ గేమ్ లో రవి, సిరి సేఫ్ అయ్యారు. ఇక మిగిలింది. ఆనీ , జేస్సీ, ప్రియ‌లు.. వీరు ముగ్గురుకి మూడు బెలూన్స్ ఇస్తారు బిగ్ బాస్. కెప్టెన్ సన్నీ ఆ బెలూన్స్ ని పగలగొడతారు. ఎవ‌రి బెలూన్స్ లోపల సేఫ్ అనే చీటీ ఉంటుందో వారు సేఫ్. అలా
జెస్సీ సేఫ్ అయ్యారు.

చివరకు మిగిలిన ఆనీ, ప్రియ.. ఇక్కడే నాగార్జున ఊహించని ట్విస్ట్ ఇస్తారు. ఇద్దరూ ఇంటి సభ్యులకు బై చెప్పేసి బయటకు వచ్చేయండి.. అంటూ చెప్పారు. అస‌లు ఎవ‌రూ ఎలిమినేట్ అయ్యారు తెలియ‌క టెన్స‌న్ తో త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ఒక్కొక్క‌రూ చెమ‌ట‌లు క‌క్కారు. ఆ త‌రువాత గార్డెన్ ఏరియాలో ఉన్న
బాక్స్ లోకి ఇద్ద‌రూ వెళ్ల‌మ‌ని చెప్పారు. ఆ బాక్స్ లో ఎవ‌రూ ఉంటే వాళ్లు సేఫ్ .. అని చెప్పారు. ఎవరు ఎలిమినేట్ అయ్యారో చూడమని నాగార్జున ఇంటి సభ్యులకు చెబుతారు. దీనితో ఉత్కంఠగా హౌస్ మేట్స్ అంతా ఆ బాక్స్ ల వైపు పరుగులు తీస్తారు.

ఆ బాక్స్ లు ఓపెన్ చేయగా ఇద్దరూ కనిపించరు. దీంతో ఇంటి సభ్యులు షాక్ తిన్నారు. ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారా? అనే అనుమానం కలిగించాడు బిగ్ బాస్.. స‌డెన్ గా ఇంటోకి ఆనీ మాస్ట‌ర్ ఇంట్లోకి రావ‌డంతో తొలుత ఆమెనే ఎలిమినేట్ అయిన‌ట్టు భావించారు. కానీ స్టేజ్ మీద ప్రియ ప్ర‌త్యేక్షం కావ‌డంతో… ప్రియాంక.. వెక్కి వెక్కి ఏడిచింది. ప్రియ ఎలిమినేట్ అయిన‌ట్టు నాగ్ ప్ర‌క‌టించారు. ఆనీ మాస్టర్ కూడా చాలా ఎమోషనల్ అయింది. ప్రియా స్టేజిపైకి వెళ్లి ఒక్కో ఇంటి సభ్యుడి గురించి సరదాగా మాట్లాడుతుంది. ఒక్కొక్కరికి మార్కులు ఇస్తుంది. అనంతరం నాగార్జున ప్రియాని బయటకు పంపుతారు. అంతటితో సండే ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version