పాలమూరు జిల్లా ప్రాజెక్టుల మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరించాలని మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి అన్నారు. దీంతో ఈ ప్రాంత రైతుల నోట్లో కేసీఆర్ మట్టి కొట్టారని చెప్పారు. శుక్రవారం చలో పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ల సందర్శనలో భాగంగా ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి అనిరుద్ రెడ్డి తదితరులు భూత్పూర్ మండలంలో కన్వీనర్ రిజర్వాయర్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కెసిఆర్ కి పాలమూరు రాజకీయ భిక్ష పెట్టిందని అన్నారు. అయితే ఇక్కడ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రెండుసార్లు అధికారాన్ని అనుభవించారని అన్నారు. పాలపూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 2015 వ సంవత్సరంలో శ్రీకారం చుట్టి ఇక్కడే కుర్చీ వేసుకుని మూడేళ్ల లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.