ఏ క్షణమైనా బీజేపీ తొలి జాబితా.. ఫస్ట్​లిస్ట్​లోనే తెలంగాణ నేతల పేర్లు

-

సార్వత్రిక ఎన్నికల సమరానికి భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది. ముందుగానే పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసిప్రత్యర్థి పార్టీలు తేరుకోకముందే ఎన్నికల ఫైట్​లో ముందుండాలనుకుంటోంది. ఇందుకోసం 100 మంది అభ్యర్థులతో తొలి జాబితా శుక్రవారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తొలి జాబితాలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్​ షా, రాజ్​నాత్​సింగ్​తోపాటు తెలంగాణకు చెందిన పలువురు అభ్యర్థుల పేర్లు ప్రకటించే ఛాన్స్​ ఉంది.


సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్ల కోసం గత కొద్ది రోజులుగా కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా పర్యటిస్తోంది. జమ్ముకశ్మీర్​, లఢఖ్​ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల కమిషన్​ పర్యటనలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్​ విడుదల చేసే అవకాశం ఉంది. అంతకుముందే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరించాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం గురువారం రాత్రి 10.30 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల వరకు ప్రధాన మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ లోక్​సభ అభ్యర్థుల ఖరారుపై సమాలోచనలు చేసింది. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్​ షా, రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ పాల్గొని చర్చలు జరిపారు. దాదాపు 16 రాష్ట్రాల నుంచి లోక్​సభ అభ్యర్థుల పేర్లు చర్చించి ఖరారు చేసినట్లు సమాచారం.

తొలి జాబితాలో తెలంగాణ నేతలు

తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. ఈ సారి అంతకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని చూస్తోంది. ఆదిలాబాద్​, నిజామాబాద్​, కరీంనగర్, సికింద్రాబాద్​ నియోజకవర్గాల్లో దాదాపు సిట్టింగ్​లకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారి పేర్లు తొలి జాబితాలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆదిలాబాద్​ నుంచి సోయం బాపూరావు, నిజామాబాద్​ నుంచి ధర్మపురి అరవింద్​, కరీంనగర్​ నుంచి బండి సంజయ్​, సికింద్రాబాద్​ నుంచి కిషన్​రెడ్డికి మరోసారి అవకాశం కల్పించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version