మెగా హీరో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. మానషి చిల్లర్ హీరోయిన్ సినిమాలో నటించారు. ఈ మూవీ పుల్వామా దాడి భారత్ పాక్ వైరం తదితర అంశాల ఆధారంగా తీశారు. ఎట్టకేలకు మార్చి ఒకటిన ప్రేక్షకులు ముందుకి ఈ సినిమా వచ్చింది. ఆపరేషన్ వాలెంటైన్ చాలాసార్లు వాయిదా పడింది.
ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులు భారీ దరికి అమ్ముడైన విషయం తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో ఆపరేషన్ వాలెంటైన్ స్క్రీనింగ్ నాలుగు వారాల తర్వాత అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు త్వరలోనే ప్రకటన వస్తుందని తెలుస్తోంది.