శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి సర్వదర్శనం కోసం రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రానికి శ్రీవారికి రూ.2.37కోట్లు ఆదాయం లభించింది.
శ్రీవారి దర్శించుకున్న పాండిచ్చేరి ముఖ్యమంత్రి..
శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెలుపలకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏటా శ్రీవారి దర్శనం భాగ్యం కలిగితే తనకు మానసిక ప్రశాంతత ఉంటుందన్నారు. దేశం మొత్తం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగంతుడ్ని ప్రార్థించినట్లు తెలిపారు. నారాయణస్వామికి జేఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం రంగనాయక మండపంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా శ్రీవారి తీర్థప్రసాదాలను తిరుమల జేఈవో అందజేశారు.