రోహిత్ శర్మకు షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధం అయింది. టి20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ లోనే ఇంటి ముఖం పట్టడంతో, పొట్టి ఫార్మాట్లో జట్టును ప్రక్షాళన చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడంతో పాటు, రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాకు టి20 కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలనే యోచనలో బోర్డు ఉందనే ప్రచారం జరిగింది.
రోహిత్ శర్మ సైతం దీనికి సమూకంగా ఉన్నాడని, వచ్చే ఏడాది ఆరంభంలో శ్రీలంకతో సిరీస్ కు ముందు అధికారిక ప్రకటన వెలువడుతుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రోహిత్ స్థానంలో వైట్ బాల్ కెప్టెన్సీ పగ్గాలను హార్దిక్ పాండ్యాకి అప్పగించాలని బీసీసీఐ భావిస్తోందట. ఈ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐ అధికారులు పాండ్యాకు చెప్పారట. అతడు ఓకే అంటే రోహిత్ స్థానంలో వన్డే, టి20లో టీమిండియా కెప్టెన్ గా హార్దిక్ ను నియమించనున్నారట.