ఆందోళనలో తల్లి తండ్రులు…

-

ఇప్పుడు అగ్ర రాజ్యం అమెరికాలో ఉన్న తమ పిల్లల విషయంలో తల్లి తండ్రుల్లో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. అక్కడి 50 రాష్ట్రాల్లో కరోనా వైరస్ చాలా తీవ్రంగా ఉంది. రోజు రోజుకి కరోనా వైరస్ పెరుగుతూనే ఉంది. 7 లక్షలు దాటాయి కరోనా కేసులు. దీనితో న్యూయార్క్, టెక్సాస్, న్యూజెర్సీ, మియామి సహా చాలా రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు భారీగా ఉన్నారు.

దీనితో వాళ్ళ ఆరోగ్యం, ప్రాణాల విషయం ఆందోళన వ్యక్తమవుతుంది. అక్కడి పరిస్థితులు దిగజారుతున్నాయి కాబట్టి అక్కడి ప్రభుత్వం అక్కడి పౌరుల మీద మాత్రమే దృష్టి పెడుతుంది. దీనితో మన వాళ్ళు కనీసం బయటకు వెళ్లి తినడానికి తిండి కూడా లేక అవస్థలు పడుతున్నారు. పరిస్థితి ఏంటీ అనేది అర్ధం కావడం లేదు. ఇక్కడి నుంచి పొలాలు, బంగారం అమ్ముకుని అమెరికా విమానం ఎక్కారు ఎందరో.

ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా నరకం చూసే పరిస్థితి ఏర్పడింది. తల్లి తండ్రులు కూడా వాళ్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ లాక్ డౌన్ తో ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తమ బిడ్డల భవిష్యత్తు ఏంటీ అంటూ ఇప్పుడు కన్నీరు మున్నీరు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉన్నారు వేలాది మంది విద్యార్ధులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version