మీ పిల్లలు హైదరాబాద్ లో చదువుతున్నారా…? అయితే రాబోయే ఏడాదిలో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. క్యాబ్, ఎన్నార్సి బిల్లుల ప్రభావమే దీనికి కారణమని అంటున్నాయి. ప్రస్తుతం దేశంలో ఆందోళనకర వాతావరణం గత కొన్ని రోజులుగా ఉంది. పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా దీనిపై నిరసనలు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో హింస కూడా భారీగానే జరుగుతుంది. దీనితో కేంద్రం అనునిత్యం అప్రమత్తంగానే వ్యవహరిస్తూ వస్తుంది.
ఈ నేపధ్యంలో ముస్లింలు ఎక్కువగా ఉండే నగరాలకు కేంద్ర హోం శాఖ కీలక హెచ్చరికలు చేసినట్టు తెలుస్తుంది. ఎన్నార్సి అమలు విషయంలో వెనక్కు తగ్గేది లేదని, క్యాబ్ విషయంలో కూడా అంతేనని కాబట్టి హైదరాబాద్ వేదికగా కొన్ని వర్గాలు రెచ్చిపోయే అవకాశం ఉందనే హెచ్చరికలు చేసింది కేంద్రం. ప్రముఖ కాలేజీల్లో చదివే విద్యార్ధులను లక్ష్యంగా చేసుకుని కొందరు అల్లర్లకు పథకం రచించే అవకాశం ఉందని, ఇప్పటికే బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి ఉగ్రవాద మూకలు హైదరాబాద్ లో అడుగుపెట్టాయని,
ప్రముఖ కాలేజీల్లో ఉండే కొందరిని ఇప్పటికే సంప్రదించారని, కాబట్టి విద్యార్ధులు జాగ్రత్తగా వ్యవహరించాలని, అల్లర్లలో పాల్గొనరాదని కేంద్రం హెచ్చరించినట్టు సమాచారం. సోషల్ మీడియాలో ఎవరిని ఫాలో అవుతున్నారు అనేది జాగ్రత్తగా చూడాలని కేంద్రం సూచించింది. తల్లి తండ్రులు కూడా తమ పిల్లల మీద దృష్టి పెట్టాలని, వాళ్ళు ఎం చేస్తున్నారు, ఎవరితో సావాసాలు చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఎం చేస్తున్నారు అనేది ఆరా తియ్యాలని హెచ్చరిస్తున్నారు. రాబోయే ఏడాది మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కేంద్రం.