బహిష్కరించడం…చంపేయడం అంతా మీ ఇష్టమేనా?

-

యువకుడి దాడిలో ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వరంగల్‌ పోచమ్మ మైదానం శివసాయి మందిరం అర్చకుడు సత్యనారాయణ అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం పూర్తయ్యాయి.  పూజారి అంత్యక్రియల్లో శ్రీపీఠాధిపతి, భాజపా నేత  పరిపూర్ణానంద పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇదేనా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ.. మాట్లాడితే బహిష్కరిస్తారా? పూజలు చేస్తే చంపేస్తారా?  అంటూ తెరాస ప్రభుత్వంపై తీవ్రం స్థాయిలో మండిపడ్డారు.  హత్య ఘటనలో నిందితుడిపై విచారణ జరిపి… మదర్సాలలో ఇలాంటి వారి జాబితాను గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు.

గత శుక్రవారం (అక్టోబర్ 26)న  5.30 గంటలకు ఆలయంలో భక్తిగీతాలను మైక్‌లో ప్రసారం చేస్తూ సాయిబాబాకు హారతిస్తున్న అర్చకుడితో ఎల్‌బీనగర్‌(వరంగల్‌) ప్రాంతానికి చెందిన సయ్యద్‌ సాధిక్‌ హుసేన్‌ మైక్‌ను ఆపాలంటూ గొడవ పడి ఆయనపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. పిడిగుద్దులు కడుపులో ఎక్కువగా గుద్దడం వల్ల  కాలేయం దెబ్బతినడంతో పాటు వయస్సు సహకరించకపోవడంతో గురువారం ఉదయం ఆయన మృతిచెందారు. పూజారి మృతిపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే.  ఇలాంటి దాడులు జరిగుతుంటే ఇక పూజలు చేసుకోవాలా వద్దా అంటూ పరిపూర్ణానంద స్వామి తెరాస ప్రభుత్వాన్ని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version