ధర్మవరం కూటమిలో విబేధాలు..పరిటాల శ్రీరామ్‌ హాట్‌ కామెంట్స్‌!

-

ధర్మవరం కూటమిలో ఎలాంటి విబేధాలు లేవంటూ స్పష్టం చేశారు ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. గతంలో మున్సిపల్ కమిషనర్ నుంచి చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అంశాలకు మల్లికార్జునతో సంబంధం ఉందని… ఈ అంశాన్ని మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. గతంలో జరిగిన అన్ని అంశాలను పరిశీలిస్తామని సత్యకుమార్ చెప్పారన్నారు.

paritala sriram son dharmavaram

కార్యకర్తలకు, నాయకులకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారని తెలిపారు. మా మూడు పార్టీలు కలిసే ఉన్నామని… ఎన్నికల ముందు ఎలా ఉన్నామో.. ఇప్పుడు అలానే ఉన్నామని వివరించారు.
అధికారులు, నాయకులు అంతా సెట్ అయ్యాక పనులు జరుగుతాయని.. ఇప్పటికే సత్యకుమార్ దృష్టికి అన్ని అంశాలు తీసుకెళ్లామని స్పష్టం చేశారు. గతంలో భూకబ్జాలు, అనేక అక్రమాలు ఉన్నాయని.. ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధే మాకు ముఖ్యమని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version