హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య పై పరిటాల సునీత హాట్ కామెంట్స్ చేశారు. మన బాలయ్య దేవుడు… రియల్ హీరో అంటూ పరిటాల రవి భార్య పరిటాల సునీత వెల్లడించారు. తాజాగా జరిగిన పద్మభూషుడికి పౌర సన్మానం సభలో బాలకృష్ణపై పరిటాల సునీత ప్రశంసల వర్షం కురిపించారు.

బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఉండటం మన అదృష్టమని ఈ సందర్భంగా పరిటాల సునీత స్పష్టం చేశారు. ఆయన చాలా గ్రేట్ హీరో అంటూ వ్యాఖ్యానించారు. దీంతో పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అటు పద్మ భూషణుడికి పౌర సన్మానం సభ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా నరసింహం బాలయ్యకు హిందూపురం నియోజకవర్గం ప్రజలు… సన్మానం కూడా చేశారు.