ఎంపీల సస్పెన్షన్ పై విపక్షాలు సీరియస్.. రేపు భేటీకి పిలుపు

-

తొలి రోజు పార్లమెంట్ సమావేశాాలు రసభాసాగా మొదలయ్యాయి. తొలి రోజు మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునే బిల్లును ఆమోదించారు. అయితే ఎలాంటి చర్చ లేకుండా బిల్లులను వెనక్కి తీసుకోవడంతో విపక్షాలు సీరియస్ అయ్యాయి. ఇటు లోక్ సభలో అటు రాజ్య సభలో విపక్ష ఎంపీలు స్పీకర్ పోడయం మందు నిరసన తెలిపారు. రాజ్య సభ సజావుగా సాగకపోవడం.. విపక్షాల ఆందోళన కారణంగా 12 మంది ఎంపీలను రాజ్య సభ చైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ చేశారు. దీంతో అకారణంగా మమ్మల్ని సస్పెండ్ చేశారంటూ విపక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.

రేపు ఉదయం పదిగంటలకు కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే కార్యాయలంలో విపక్షాలు సమావేశానికి పిలుపునిచ్చాయి. భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో విపక్షాలు చర్చించనున్నాయి. తమ ప్రజాస్వామ్య హక్కులను, ప్రజల తరుపున ప్రశ్నించే గొంతుకలను కేంద్రం నొక్కెస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. 12 మంది రాజ్య సభ ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని విపక్షాలు ఖండిస్తున్నాయి. సస్పెన్షన్‌ వేటుకు గురైన వారిలో ఎలమరం కరీం( సీపీఎం), ఫూలో దేవి నేతమ్, ఛాయా వర్మ, ఆర్ బోరా, రాజమణి పటేల్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, అఖిలేష్ ప్రసాద్ సింగ్ – (INC), బినోయ్ విశ్వం – CPI, డోలా సేన్ & శాంత ఛెత్రి – TMC, ప్రియాంక చతుర్వేది & అనిల్ దేశాయ్ – శివసేన ఉన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version