లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులో పాస్టర్ బజీందర్ సింగ్‌కు మొహాలీ పోక్సో కోర్టు జీవిత ఖైదు విధించింది. 2018 సంవత్సరంలో జీరక్‌పూర్‌లో ఆయనపై నమోదైన లైంగిక వేధింపులు, అత్యాచారం కేసుల్లో పాస్టర్‌ను కోర్టు దోషిగా తేల్చింది. ఒక మహిళ ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కేసులు నమోదయ్యాయి.
బాధితురాలి కథనం ప్రకారం..బజీందర్ సింగ్ తనను విదేశాలకు తీసుకెళ్తానని ఆశ చూపి లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.అంతేకాకుండా మైనర్లను లైంగికంగా వేధించినట్లు సమాచారం. దీంతో అతనిపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 376 (అత్యాచారం), 323 (గాయపరచడం), 506 (బెదిరింపు) వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సుదీర్ఘ విచారణ అనంతరం మార్చి 28, 2025న మొహాలీ కోర్టు బజీందర్ సింగ్‌ను దోషిగా ప్రకటించి జీవిత ఖైదు విధించింది.