ఏపీలో పాస్టర్ ప్రవీణ్ మరణంపై నేటికీ అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ మృతి చెందాడని ప్రభుత్వం, పోలీసులు చెబుతుండగా..ఆయనది ముమ్మాటికీ హత్యే అని అటు క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు ఆరోపిస్తున్నారు.
తాజాగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సైతం పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆయనది ముమ్మాటికీ హత్యే అని ఆరోపించారు. 24వ తేదీ రాత్రి 9.30 గంటలకు ప్రవీణ్ తన ఫోన్ నుంచి అతని భార్యతో మాట్లాడాడని.. 9.30కు విజయవాడలో ఉన్న ప్రవీణ్..11.30కు రాజమండ్రి ఎలా చేరుకున్నాడు? అని ప్రశ్నించారు. ‘నా పవర్స్ నాకు ఉన్నాయి..నేను శపిస్తే బూడిదైపోయినవాళ్లు చాలా మంది ఉన్నారు’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.