ఏపీలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి చెందడంపై పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని అటు క్రైస్తవ సంఘాలు, ప్రతిపక్ష వైసీపీకి చెందిన కీలక నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. తాజాగా పోలీసుల తీరుపై టీడీపీ నేత మహాసేన రాజేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రవీణ్ పగడాల మృతి విషయంలో పోలీసులు చాలా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రవీణ్ ది హత్య కాదు ఆక్సిడెంట్ అని కొందరు పోలీసులు మంత్రి నారా లోకేష్‌కు సమాచారం ఇచ్చారు.ఆ సమాచారం ఇచ్చిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని కావాలని బద్నాం చేయడానికే కొందరు పోలీసులు ఇలా చేస్తున్నారన్నారు.పోలీసులు అనవసరంగా మాతో డబుల్ గేమ్స్ ఆడుతున్నారని..శుక్రవారం సాయంత్రంలోపు ఈ కేసులో అన్ని నిజాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.