ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీ ప్రజల పక్షంలో నిలబడటంలో విఫలమైంది…ప్రజాసంకల్పం పేరుతో పాదయాత్రలో తలపై నిమరడం, బుగ్గలురుద్దడం కాదు వంటివి మాని.. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయండి అంటూ విమర్శించారు. నాడు అనుభవజ్ఞుడైన నాయకుడని చంద్రబాబుకు మద్దతిస్తే అంతా అవినీతిమయం చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు.
తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మట్లాడుతూ… పెద్దాపురం మండలం సూరంపాలెంలో రూ.2వేల కోట్ల విలువైన మట్టిని తవ్వినప్పటికీ చిన్నబాబుకి అవినీతి కనబడటం లేదన్నారు… తెదేపా ప్రభుత్వ అక్రమాలను నిరూపిస్తాం.. వస్తారా లోకేశ్? అని సవాల్ విసిరారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని నాకు… ఒక్క పిలుపుతో రాజహేంద్రవరంలో 10లక్షల మంది కవాతులో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఎన్నిసార్లు తూర్పుగోదావరి జిల్లాకి వచ్చిన ఇక్కడ ప్రజల అభిమానం మరువలేనిదన్నారు. ప్రజా జీవితంలో భాగంగా, ప్రజా సేవ చేయడానికి వచ్చానన్నారు. మన రాష్ట్రానికి చెందిన గాంధీలు ప్రస్తుతం జగన్, చంద్రబాబు, లోకేశ్‌లేనని ఎద్దేవా చేశారు. సొంత అన్నని కాదనుకుని అన్ని వదులుకుని ప్రజల మధ్యలోకి వచ్చా…మీ మద్దతు ఉంటే ఏదైనా సాధిస్తానంటూ పవన్ ధీమా వ్యక్తం చేశారు.