ఏలూరు జిల్లా రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయి శరవేకంగా మారుతున్నాయి రాజకీయాలు కాపు ఉద్యమ నేత సీనియర్ నాయకుడు కొంతకాలంగా టిడిపిలో కానీ జనసేనలో కానీ చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈరోజు జరిగిన ఓ పరిణామంలో నిజం తేలింది టీడీపీ నేత మాజీ ఎంపీ మాగుంట బాబు ఇంటికి మంగళవారం ముద్రగడ పద్మనాభం వెళ్లారు. భేటీ అయ్యారు ఆ తర్వాత వెళ్ళిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిందని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేసినట్లు మాగంటి బాబు చెప్పారు.

కోట్లు పెట్టగలిగితేనే వైసీపీలో సీటు వస్తుందని అన్నారు. జనసేన లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముద్రగడ చెప్పినట్లు మాగంటి బాబు అన్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే అందర్నీ కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మాగంటి బాబు చెప్పారు ముద్రగడ పద్మనాభం టీడీపీ లోకి వచ్చినా సరే జనసేనలో చేరిన తమకి ఓకేనని చెప్పారు.