వాజ్ పేయీ, అడ్వాణీ కూడా ఇలా మాట్లాడలేదు.. మోదీ లోక్ సsభ స్పీచ్ పై కాంగ్రెస్ ఫైర్,

-

లోక్సభ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెడుతూ ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఈ ప్రసంగంలో దేశ తొలి ప్రధాని నెహ్రూను ఉద్దేశించి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ప్రధాని అభద్రతా భావంతో బాధ పడుతున్నారని విమర్శించింది. అందుకే నెహ్రూపై రాజకీయంగా కాకుండా వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయింది.

నెహ్రూ గురించి బీజేపీ సీనియర్‌ నేతలు వాజ్‌పేయీ, అడ్వాణీ కూడా ఈ విధంగా మాట్లాడలేదని, కానీ ప్రధాని మోదీ ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నత పదవిని కించపరుస్తున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ మండిపడ్డారు. “సోమవారం రోజున లోక్‌సభలో మాట్లాడిన ప్రధాని మోదీ మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మెగాలోమానియా, నెహ్రూ ఫోబియాతో కూడిన  విషపూరిత మిశ్రమం ప్రజాస్వామ్య హత్యకు దారి తీస్తోందని అన్నారు. అందుకే దేశ ప్రజలు ముఖ్యంగా యువత లోక్‌సభలో ప్రధాని మోదీకి ఇదే చివరి ప్రసంగమని అనుకుంటున్నారు.” అని జైరాం రమేశ్‌ అన్నారు. పదేళ్ల అన్యాయ కాలం త్వరలో ముగియనుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news