పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొత్త డిమాండ్..!!

-

పవన్ కళ్యాణ్ కు తెలుగు సినిమా ప్రేక్షకుల లలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను రాజకీయాల్లో ఉన్నా కూడా ఇటు సినిమాలకు కూడా టైమ్ కేటాయిస్తూ రెండు పడవల మీద కాలు పెట్టాడు. సినిమాలు చేయడం అనేది నాకు జాబ్ లాంటిదని, నాకు ఏ ఇతర బిజినెస్ తెలియదు అని, ఇది లేక పోతే నా దగ్గర డబ్బులు ఉండవు అని కుండ బద్దలు కొట్టినట్లు గా చెప్పేశాడు.

ప్రస్తుతం పవన్  హారి హర వీర మల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో వుంది. ఇక నెక్స్ట్ ఛాన్స్ హరీశ్ శంకర్ కు ఇవ్వకుండా సాహో తీసిన సుజిత్ కు ఇచ్చాడు.మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఎలక్షన్స్ అయ్యే వరకూ పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా స్టార్ట్ అవ్వడం కష్టమే అని టాక్ నడుస్తోంది

ఈ గోల ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొత్త పాట ఎత్తుకున్నారు. ఈ సినిమా కు లేటెస్ట్ మ్యూజిక్ సంచలనం అనిరుద్, పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతం అందించాలని గోల మొదలు పెట్టారు. వారు #DVVWeWantAnirudhForOG అనే హాష్ ట్యాగ్ ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అనిరుద్ ఐతేనే పవన్ కళ్యాణ్ స్టామినా కు న్యాయం చేస్తాడని అతడే కావాలని డిమాండ్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్, దానయ్య లు వారి మొర ఆలకించి అనిరుద్ ను పెడతారెమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version