పవన్ చేతిలో మూడు సినిమాలు! ఏది ముందో.!

ప్రస్తుతం పవన్ కళ్యాణ్  ”హరిహర వీరమల్లు”. సినిమా లో నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఎప్పటి నుండో షూటింగ్ జరుపు కుంటూనే వుంది. పవన్ రాజకీయాల వల్ల షూటింగ్ కి అడ్డంకి  ఎదురవుతూనే ఉంది.. దీంతో ఎప్పుడు ఈ షూటింగ్ వాయిదా పడుతూనే వస్తుంది. పవన్ కూడా రాజకీయాలకు, సినిమాలకి టైమ్ ఇస్తూ వస్తున్నాడు.

తాజాగా చాలా రోజుల తర్వాత మళ్లీ సినిమా షూటింగ్ కోసం పవన్ మళ్ళీ సెట్స్ లోకి”హరిహర వీరమల్లు” అడుగు పెట్టాడు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరగా కంప్లీట్ చేయాలని పవన్ లక్ష్యంగా పెట్టుకున్నారట. ఎందుకంటే ఈ సినిమా చాలా రోజుల నుండి కొనసాగుతోంది .ఇక ఈ సినిమా మొత్తం పూర్తి అయిన తరువాత మాత్రమే వేరే సినిమా మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు.

ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాస్తవానికి హరీశ్ శంకర్ సినిమా భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఉందని అనుకున్నారు.  హరీశ్  శంకర్ ఇప్పుడు ఎప్పటి నుండో  వెయిట్ చేస్తూ ఉన్నాడు.అయినా కూడా పవన్ కళ్యాణ్ దగ్గర ఇంకా రెండు సినిమాలు చేతిలో ఉన్నాయట.సాహో డైరక్టర్ సుజిత్- ఆర్ ఆర్ ఆర్ నిర్మాత దానయ్య, సముద్రఖని-విశ్వప్రసాద్ లు లైన్ లో ఉన్నారు. వీటిలో ముందు హరీశ్ శంకర్ కే ముందు అవకాశం ఉంది అని అంటున్నారు.